VZM: పిఠాపురంలో ఈ నెల 14న జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ గిరిడ అప్పలస్వామి పిలుపునిచ్చారు. బొబ్బిలి పార్టీ కార్యాలయంలో కరపత్రాలను బుధవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం పిలుపుమేరకు నియోజకవర్గ వ్యాప్తంగా అధిక సంఖ్యలో జనసైనికులు తరలిరావాలని పిలుపునిచ్చారు.