SKLM: మానసిక, శారీరక వైకల్యంతో బాధపడుతున్న పిల్లలు పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఫిజియోథెరపీ డాక్టర్ గ్రేస్ శాంతి తల్లిదండ్రులకు అవగాహన కలిగించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు హిరమండలం మండల కేంద్రంలోని భవిత కార్యాలయంలో బుధవారం ఫిజియోథెరపీ నిర్వహించారు. ఇంటి వద్ద కూడా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఫిజియోథెరపీ అభ్యసన చేయించాలన్నారు.