SKLM: ప్రతి మహిళా ఉద్యోగి చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, సామాన్య ప్రజలకు చేరేలా కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి గౌరవ ఆర్.సన్యాసినాయుడు అన్నారు. మంగళవారం నగరంలోని ఐసీడీఎస్ కార్యాలయంలో జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు జరిగాయి. మహిళా ఉద్యోగులకు ప్రస్తుతం జరుగుతున్న నేరాలు, వాటికి విధిస్తున్న శిక్షలు, చట్టాలపై ఆయన అవగాహన చేశారు.