కృష్ణా – గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు ఎమ్మెల్యే రాము శుభాకాంక్షలు తెలియజేశారు. గుడివాడ టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ.. కూటమికి మద్దతుగా నిలిచిన పట్టభద్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆలపాటి రాజా అఖండ విజయం సాధించేలా కష్టపడిన కూటమి శ్రేణులను అభినందించారు.