TG: మామునూరు ఎయిర్పోర్టు పరిసర గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ భిన్న ప్రకటనలతో గందరగోళం ఏర్పడింది. నిర్వాసితులకు భూమికి బదులు భూమి ఇస్తామని మంత్రి సురేఖ ప్రకటించగా.. భూమి ఇవ్వటం కుదరదని ఎమ్మెల్యే రేవూరి స్పష్టం చేశారు. దీంతో వరంగల్-నెక్కొండ హైవేపై రైతులు ఆందోళనకు దిగారు. భూమికి బదులు భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు.