కర్నూలు: బడ్జెట్ కేటాయింపుల్లో రాయలసీమకు తీవ్ర అన్యాయం చేశారని పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. బడ్జెట్ వల్ల రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదరి ఎద్దేవా చేశారు. అమరావతి అభివృద్ధికి రూ.6000 కోట్లు కేటాయించి, వెనుకబడిన రాయలసీమ జిల్లాల పట్ల వివక్షత చూపడం సరికాదన్నారు.