కర్నూలు: రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితను గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు, ఆలూరు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుమ్మనూరు నారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం హోం మంత్రి అనితను గుమ్మనూరు నారాయణ కలిసి పూలమాలలు, శాలవాలుతో సన్మానించారు. నియోజకవర్గ సమస్యలను హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన వివరించారు.