KMM: మధిర పట్టణానికి చెందిన మహాత్మా గాంధీ ఓల్డ్ క్లాత్ బ్యాంకు నిర్వాహకులు లంక కొండయ్య ఇటీవల పట్టణంలోని పలువురు ప్రముఖుల వద్ద నుండి సేకరించిన పాత బట్టలను, దుప్పట్లను శనివారం పట్టణంలోని అభాగ్యులకు, నిరుపేదలకు వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.