మన్యం: జిల్లాకు బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జరిగిందని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం డీఆర్ఓకి మెమోరండం అందించారు. సీపీఎం నాయకులు మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీలు లేవు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేవు జిల్లా కేంద్రానికి ఏమీ నిధులు కేటాయింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.