TG: రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉందని.. ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. మహిళల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కులగణనలో తప్పులున్నాయని ఆరోపించిన KCR, KTR, హరీశ్ రావు మరోసారి చేపట్టిన సర్వేలోనూ వివరాలు ఇవ్వలేదని మండిపడ్డారు.