కోనసీమ: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ద్రాక్షారామ శ్రీమాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారిని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. మహా శివరాత్రి సందర్భంగా మంత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు మంత్రికి వేద ఆశీర్వచనం, స్వామివారి ప్రసాదం అందజేశారు. స్వామి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నారు.