PPM: జాతర, ఉత్సవాల్లో ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వైద్య శిబిరాలు దోహదపడతాయని ఆరోగ్యశాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు పేర్కొన్నారు. మహా శివరాత్రి మహోత్సవం సందర్భంగా కొమరాడ మండలంలో గుంప శ్రీ సోమేశ్వరస్వామి దేవస్థానం వద్ద ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని బుధవారం ఆయన పర్యవేక్షించారు.