ASR: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడానికి అరకులోయ మండలంలో 133 మంది టీచర్లు ఓటర్లుగా నమోదు చేసుకున్నట్లు తహసీల్దారు ఎంవివి ప్రసాద్ తెలిపారు. వీరిలో 93 మంది పురుషులు, 40 మంది మహిళలు ఓటర్లుగా ఉన్నారన్నారు. అలాగే రేపు జరిగే ఎన్నికలకు ఏర్పాట్లు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం పోలింగ్ కేంద్రాన్ని అరకు సీఐ, ఎస్సైలతో పరిశీలించారు.