ELR: పరమశివుని ఆశీస్సులతో రాష్ట్రం అన్ని రంగాలలో ప్రగతిపథంలో నడవాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏలూరు అగ్రహారంలోని శ్రీ అన్నపూర్ణా సమేత ప్రతాప విశ్వేశ్వరస్వామివారి దేవస్థానం, పవర్ పేటలోని శ్రీ కాశీ అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామి ఆలయాలను ఆయన సందర్శించారు.