W.G: ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలకు రెవెన్యూ సిబ్బంది సిద్ధం అవుతున్నారు. నరసాపురం సబ్ కలెక్టరేట్ వద్ద సబ్ డివిజన్లోని ఎనిమిది మండలాలకు సంబంధించిన పోలింగ్ సామాగ్రిని తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో దాసిరాజు మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. అలాగే సిబ్బందికి పలు సూచనలు చేశారు.