NLG: మార్చి 21 నుండి ఏప్రిల్ 4 వరకు జరిగే 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, భువనగిరి రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం మినీ మీటింగ్ హాల్లో పరీక్షల నిర్వహణపై అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పరీక్షల కోసం జిల్లాలో 50 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.