కృష్ణా: సైబర్ నేరగాళ్ల చేతిలో ఓ ఉపాధ్యాయుడు మోసపోయాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న కానూరుకి చెందిన రమణమూర్తి అతని ఫోన్ కు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని మెసెజ్ వచ్చింది. దీంతో ఆయన విడతల వారీగా రూ.1.55లక్షలు పెట్టుబడి పెట్టారు. వారి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో మోసపోయాయనని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.