AP: కర్ణాటక హసన్ జిల్లా సిద్ధాపురం పరిధిలోని హరత్నాహల్లిలో పాత కోళ్లఫారాల షెడ్లపై దాడులు నిర్వహించి రూ.5 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ఫోర్స్ చీఫ్ సుబ్బరాయుడు తెలిపారు. 8 మంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. అలాగే, 8 టన్నుల బరువున్న 195 దుంగలు స్వాధీనం చేసుకుని, 3 వాహనాలను సీజ్ చేసినట్లు చెప్పారు.