SKLM: పోలాకి మండలం రాళ్లపాడు కాలనీలో ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ 12వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆయనతోపాటు ఎంపీపీ ముద్దాడ బైరాగి నాయుడు, మండల అధ్యక్షులు కణితి కృష్ణారావు, తదితరులు ఉన్నారు.