విశాఖ ఉక్కుల పని చేస్తున్న 16 మంది అధికారులకు యాజమాన్యం ఛార్జిషీట్లు జారీ చేసింది. ఉక్కు కర్మాగారం అప్పుల్లో రూ.220 కోట్లు కలపకపోవడంతో ఛార్జిషీట్లు జారీ చేస్తున్నట్లు పేర్కొంది. వీరిలో కర్మగారంలోని ఆర్ఎండీ, క్యూఏటీడీ, ఎంఎం ఫైనాన్స్ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు ఉన్నారు. ఛార్జిషీట్లు అందుకున్న వారిలో కొందరు ఈ నెలాఖరులోన పదవీ విరమణ చేయనున్నారు.