భారత్-కెనడా మధ్య కీలక ఒప్పందం కుదిరింది. 2.6 బిలియన్ డాలర్ల విలువైన యురేనియం సరఫరా ఒప్పందం మీద ఇరుదేశాలు సంతకాలు చేశాయి. అలాగే సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA)పై చర్చలు జరిపేందుకు అంగీకారం కుదిరింది. హైదరాబాద్ హౌస్లో ప్రధాని మోదీ, కెనడా ప్రధాని మార్క్ కార్నీ మధ్య జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.