AP: రేపు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. కల్తీ పాలు, అతిసారం, వేట్లపాలెం పేలుడు, టీటీడీ ఛైర్మన్ వివాదం ఇలా వరుస ఘటనల నేపథ్యంలో వారి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. టీటీడీ లడ్డు అంశం, వన్‌మెన్ కమిటీ, కూటమి ఎమ్మెల్యేల పనితీరుపై ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంది. నామినేటెడ్ పోస్టుల భర్తీపై కూడా చర్చించే ఛాన్స్ ఉంది.