KNR: శంకరపట్నం మండలం మక్త శివారులో శనివారం సాయంత్రం బైక్ ఢీకొని మహిళకు తీవ్రగాయాలు అయ్యాయి. ముత్తారంకి చెందిన ఓ ద్విచక్ర వాహనదారుడు, పొలం పనులకు వెళ్లి తిరిగి వస్తున్న మక్త గ్రామానికి చెందిన ఎలుకపల్లి నర్సమ్మను ఢీకొనడంతో ఆ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108లో ఆసుపత్రికి తరలించారు.