ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులు బద్దలు చేసిన సినిమా ఏదంటే.. ముందుగా గుర్తొచ్చే సినిమా ‘అవతార్’. 2009లో దిగ్గజ దర్శకుడు జేమ్స్ కేమరూన్ ఈ సినిమాతో అద్భుతమే చేశాడు. అందుకే 13 ఏళ్లయినా కూడా.. అవతార్(Avatar) సీక్వెల్స్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అవతార్ సమయంలోనే సీక్వెల్స్ ప్రకటించాడు కామేరున్(james cameron). ప్రస్తుతం అవతార్2 రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా రన్ టైమ్ కూడా లాక్ చేసినట్టు తెలుస్తోంది. అవతార్2 దాదాపు మూడు గంటల పది నిమిషాలు ఉంటుందని తెలుస్తోంది.
‘అవతార్.. ది వే ఆఫ్ వాటర్’ టైటిల్‌తో రానున్న ఈ సినిమా.. డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో.. జేమ్స్ కామెరూన్ ఈ సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంటున్నాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్య్యూలో మార్వెల్ డీసీ మూవీస్ పై కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. ఈ సూపర్ హీరోల సినిమాల్లో పాత్రలు ఎంత పెద్దవైనా సరే.. కాలేజ్‌లో ఉన్నట్టుగానే ప్రవర్తిస్తాయని.. ఈ పాత్రల మధ్య సంబంధాలు ఉన్నా.. వాటిని కంటిన్యూ చేయలేకపోయారని అన్నాడు.
భారీ హంగు ఆర్భాటాలతో ఆ సినిమాలు ఉంటున్నా.. క్యారెక్టర్ల మధ్య సంబంధాలు వాస్తవానికి దూరంగా ఉంటాయని.. అందుకే ఆ సూపర్ హీరో సినిమాలు ఆకట్టుకోలేకపోతున్నాయని అన్నాడు. తన అవతార్ సీక్వెల్లో అలా ఉండదని.. తన పాత్రల మధ్య రిలేషన్ బలంగా ఉంటుదని తెలిపాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ హాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మరి అంచనాలు పెంచేస్తున్న అవతార్2 బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.