CTR: వెదురుకుప్పం మండలం చిన్ననక్కలపల్లి గ్రామంలో శనివారం నగరి DSP మహమ్మద్ సయ్యద్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. DSP మాట్లాడుతూ.. తనిఖీలలో సరైన రికార్డులు లేని 40 స్కూటర్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. నాటు సారా తయారు చేసినా, అమ్మిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐ హనుమంతప్ప, ఎస్సై రాజకుమార్ సుమన్, సిబ్బంది పాల్గొన్నారు.