Policeలకు చుక్కలు చూపిస్తోన్న అమృత్ పాల్ సింగ్.. దొరికినట్టే దొరికి తప్పించుకుంటూ
Amritpal Singh:ఖలిస్థాన్ వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh) పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు. దొరికినట్టే దొరికి తప్పించుకుంటూ.. పోలీసులతో (police) దాగుడు మూతలు ఆడుతున్నాడు. గత 10 రోజుల (10 days) నుంచి అతని కోసం పోలీసులు (police) ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం (నిన్న) తృటిలో తప్పించుకున్నారు. పంజాబ్ హొసియాపూర్ చెక్ పోస్ట్ వద్ద నుంచి అతని కారు వెళ్లింది.

అమృతపాల్ సింగ్ (Amritpal Singh) ఉన్నారనే అనుమానంతో ఫగ్వారా నుంచి హోషియార్పూర్ వస్తోన్న ఇన్నోవా కారును (innova car) పోలీసులు (police) వెంబడించారు. పోలీసు (police) చెక్ పోస్టు దాటుకొని వెళ్లిన కారు మెహతియానాలోని గురుద్వారా వద్ద ఆగిందని… నిందితులు కారును గురుద్వారా సమీపంలో వదిలి పారిపోయారని పోలీసులు (police) తెలిపారు. పాపల్ ప్రీత్, మరో అనుచరుడితో కలిసి అమృత్ పాల్ (Amritpal Singh) తప్పించుకున్నాడని చెప్పారు.
అమృత్ పాల్ (Amritpal Singh) కోసం పంజాబ్ పోలీసులు సమీప ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. కొద్దీ రోజుల కింద జలంధర్‌లో అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh) పోలీసుల కళ్లుగప్పి పారిపోయాడు. అతను తన వేషాన్ని మారుస్తూ.. వేర్వేరు వాహనాల్లో ప్రయాణించడం పోలీసులుకు సవాల్‌గా మారింది.
జలందర్ నుంచి పారిపోయేందుకు అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh) ఓ మహిళ (women) సాయం తీసుకున్నారని పోలీసులు తెలిపారు. పాటియాలా నుంచి ఢిల్లీకి.. వారిని అడ్డు పెట్టుకొని వచ్చారని పోలీసులు తెలిపారు. మహిళ పాపల్ ప్రీత్ స్నేహితురాలు అని పేర్కొన్నారు. పాటియాలా నుంచి నెట్ వర్క్ వాడారని.. హర్యానాలో గల ఓ ఇంట్లో ఉన్నారని వివరించారు. ఆ మహిళ సోదరుడి మొబైల్స్ నుంచి సన్నిహితులకు కాల్ చేసే వారని తెలిపారు. ఆ మహిళ పేరు బల్జీత్ కౌర్ అని.. ఆమెను అరెస్ట్ చేశామని పోలీసులు పేర్కొన్నారు.
మార్చి 21వ తేదీన మహిళ స్నేహితురాలి ఇంటి వద్ద అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh) ఉన్నారని వివరించారు. ఆ మహిళతో పాపల్ ప్రీత్ రైతుల ఆందోళన సమయంలో కలిశారు. అతను అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh) సహచరుడు అని తెలియదని చెప్పారు. ఆ రోజు రాత్రి మహిళ ఇంటి వద్దే పడుకున్నారని వివరించారు.