NRML: సారంగాపూర్ మండలం కౌట జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలకు శనివారం కరుణాకర్ రెడ్డి 15వేలు విలువచేసే సౌండ్ సిస్టంను అందజేశారు. అదేవిధంగా పాఠశాల కొరకు బ్యాండ్, విద్యార్థుల బహుమతులకు పదివేల నగదును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరు తోడ్పడాలని అన్నారు. ఇందులో బీజేపీ మండల అధ్యక్షుడు విలాస్ తదితరులు పాల్గొన్నారు.