ADB: సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్‌ను సికింద్రాబాద్‌లోని ఆయన కార్యాలయంలో ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని రైల్వే అభివృద్ధి పనులతో పాటు రైల్వే స్టేషన్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. రైళ్ల సంఖ్యను పెంచాలని కోరారు.