HYD: రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ACBకి చిక్కిన సీఐ లంచం డబ్బులు తీసుకుంటూ హైదరాబాద్‌లోని షాహినాయత్‌గంజ్ సీఐ బాలు చౌహన్ ఏసీబీకి చిక్కాడు. మిస్సింగ్ కేసులో అనుమానితుడిగా ఉన్న ఓ వ్యక్తి పేరును తొలగించేందుకు రూ.1,50,000 లంచం డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. డిమాండ్ చేసిన డబ్బులో రూ.50వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.