NZB: తప్పిపోయిన బాలుడిని నిజామాబాద్ వన్ టౌన్ పోలీసులు సోమవారం రాత్రి బాలుడి తల్లికి అప్పగించారు. నిజామాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో మాటలు రాని సుమారు 11 సంవత్సరాల బాలుడు తప్పిపోయి కనిపించగా అతడిని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆ బాలుడిని అహ్మద్ పురా కాలనీకి చెందిన సూఫీయాన్గా గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించినట్లు వన్ టౌన్ SHO రఘుపతి వివరించారు.