E.G: జిల్లాకు ప్రభుత్వం నిర్దేశించిన 3,823 పేద ప్రజల ఇళ్ల నిర్మాణం లక్ష్యాన్ని మార్చి-2025 నాటికి పూర్తి చేయాలని అధికారులకు జేసీ చిన్న రాముడు సూచించారు. జిల్లా కలెక్టరేట్ నుంచి మండలస్థాయి అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న పేద ప్రజల గృహ నిర్మాణాల ప్రక్రియపై ఆయన వివరాలను తెలుసుకుని, వారికి తగు సూచనలు చేశారు.