NZB: పసుపు బోర్డు విషయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫోటోలను మార్ఫింగ్ చేసి X వేదికగా సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసిన వారిపై కేసు నమోదు చేయాలని తెలంగాణ జాగృతి మహిళా విభాగం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోస్ట్ చేసిన @AravindAnnaArmy అనే హ్యాండిల్‌తో పాటు దీని వెనక ఉన్నవాళ్లపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.