KKD: కాకినాడ పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ ద్వారకా తిరుమలరావును కాకినాడ రూరల్ MLA పంతం నానాజీ సోమవారం సాయంత్రం మర్యాదపూర్వక కలిశారు. రూరల్ పరిధిలోని సర్పవరంలోని పోలీస్ గెస్ట్ హౌస్లో డీజీపీని కలిశారు. డీజీపీకి పుష్పగుచ్చం అందజేసి, శాలువతో సన్మానించారు. అనంతరం శాంతి భద్రతల విషయాలపై వారిరువురు కాసేపు చర్చించారు.