PPM: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRSలో 5 వినతులు స్వీకరించినట్లు అదనపు ఎస్పీ ఓ.దిలీప్ కిరణ్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు ఇచ్చిన అర్జీలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమస్యలు పరిష్కరించి నివేదికను ఎస్పి కార్యాలయానికి అందజేయాలని సిబ్బందికి సూచించారు.