VZM: గజపతినగరం ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో వనిజ గ్రామంలో సోమవారం సీఐ జె.జనార్దనరావు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించగా రెండు లీటర్ల నాటు సారాతో బాకా పెంటయ్య పట్టుపడ్డాడు. ఈ దాడుల్లో ఎస్సైలు కొండలరావు, నరేంద్ర కుమార్, హెచ్సీలు భాషా, లోకాభి సిబ్బంది పాల్గొన్నారు. పెంటయ్య పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు.