ATP: తాడిపత్రి మున్సిపల్ కార్యాలయంలో జేసీ ప్రభాకర్ రెడ్డిని పద్మశాలి కుల సభ్యులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టణంలోని మార్కండేయ స్వామి దేవస్థానంలో జయంతి ఉత్సవాల నిర్వహణపై మున్సిపల్ ఛైర్మన్‌తో చర్చించారు. ఈ ఏడాది జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు జేసీ వారికి తెలిపారు.