ATP: గుత్తి శ్రీశ్రీశ్రీ సునామ జకినీ మాత అమ్మవారి జాతర మహోత్సవ కరపత్రాలను సోమవారం ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మున్సిపల్ ఛైర్మెన్ వన్నూరుబి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు ఆలూరు లక్ష్మణరావు మాట్లాడుతూ.. ఫిబ్రవరి 6 నుంచి అమ్మవారి జయంతి మహోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు.