ASF: బూరుగూడ గ్రామంలోని పల్లె దవాఖానను కలెక్టర్ వెంకటేష్ దోత్రే సోమవారం సందర్శించారు. హెల్త్ వెల్నెస్ సెంటర్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను తనిఖీ చేశారు. ఆసుపత్రి రికార్డులను, మెడికల్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా వ్యాధిగ్రస్తులకు అందిస్తున్న సేవల గురించి అరా తీశారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు.