ASF: గొల్లగూడలో నాబార్డు, ప్రతిమ ఫౌండేషన్ కరీంనగర్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన వైద్య శిబిరానికి జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్బంగా శిబిరంలో కలెక్టర్ వైద్య పరీక్షలు చేసుకున్నారు. ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి సిబ్బంది మందులు అందజేశారు. ప్రజలు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.