ASF: నార్నూర్ మండలం భీంపూర్ గ్రామానికి చెందిన గిరిజన యువకుడు అరవింద్ జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికయ్యారు. కాగా ఇటీవల రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన బాక్సింగ్ క్రీడా పోటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. దీంతో గ్రామస్థులు, బంధువులు అరవింద్‌ను అభినందించారు. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తేవాలన్నారు.