ATP: పుట్లూరు మండల వ్యాప్తంగా స్పెషల్ ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీడీవో అలివేలమ్మ తెలిపారు. 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు, 27 నుంచి 30వ తేదీ వరకు రెండు విడతలుగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు. దీనిపై గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.