AP: సోషల్ మీడియాలో వచ్చేది వేరు.. జరిగిన వాస్తవం వేరని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు. తనపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేసిన వాళ్లే ఇవాళ తనతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. ‘తిరువూరు ప్రజలకు అన్ని వాస్తవాలు తెలుసు. క్రమశిక్షణ సంఘం సభ్యులకు రాతపూర్వకంగా, నేరుగా కలిసి చెప్పా. పార్టీ కోసం పనిచేసిన వాళ్లను ఎవరూ దూరం పెట్టరు’ అని పేర్కొన్నారు.