కృష్ణా: విజయవాడ 16వ డివిజన్‌కు చెందిన టీడీపీ నాయకుడు గోగుల రమేశ్ శనివారం మరణించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆదివారం రమేశ్ ఇంటికి చేరుకుని భౌతికఖాయానికి నివాళులర్పించారు. అనంతరం సత్యనారాయణ నగర్ 2వ లైన్, కళానగర్ మీదుగా సాగిన రమేశ్ అంతిమయాత్రలో పాల్గొన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.