SKLM: పాతపట్నం మేజర్ పంచాయతీ దువ్వారి వీధికి చెందిన పెద్దింటి తిరుపతిరావు పై హత్య ప్రయత్నం జరిగింది. తిరుపతి నిద్రిస్తుండగా రాత్రి 3 గంటల సమయంలో ( సోమవారం తెల్లవారుజామున) గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడి కత్తితో మెడ పైన దాడి చేశారు. తిరుపతిరావు ఆంధ్రపత్రిక రిపోర్టర్‌గా పనిచేస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.