శ్రీకాకుళం రెండో పోలీసు స్టేషన్ పరిధిలో గల న్యూ కాలనీలో ఆదివారం రాత్రి పూజారి కళావతి హత్యకు గురైంది. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ఘటన స్ధలాన్ని పరిశీలించి హత్యకు కారణాలపై ఆరా తీశారు. క్లూస్ టీమ్‌తో ఘటన స్ధలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.