ప్రకాశం: మద్దిపాడు మండలం గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్లో శుక్రవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. పోకూరి కృష్ణమోహన్‌కి చెందిన ఖాళీ స్థలంలో ఉన్న ప్లాస్టిక్ వేస్ట్ మెటీరియల్ మంటల్లో కాలిపోయింది. అద్దంకి అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్‌తో వచ్చి మంటలను ఆర్పివేశారు. రూ.40 వేల వరకు నష్టం జరిగినట్లు బాధితుడు కృష్ణమోహన్ తెలిపారు.