KRNL: చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదోని మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. మండిగిరికి చెందిన శివ(35) రోజువారి కూలీ. శివ గోనెగండ్ల మండలం పెద్దమరివీడుకు చెందిన పార్వతిని వివాహం చేసుకున్నాడు. నిన్నటి నుంచి కనిపించకపోయిన శివ నాగలాపురం చిన్నగోగులగుట్ట పత్తిపొలంలో వేపచెట్టుకు ఉరి వేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.