కృష్ణా: కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన సందర్భంగా భద్రత ఏర్పాట్లపై విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు శుక్రవారం ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 18, 19న జిల్లాలో కేంద్రమంత్రి పర్యటన సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.