కృష్ణా: త్రివేండ్రంలోని ఇస్రోలో సైంటిస్ట్‌గా చేరనున్న నియోజకవర్గానికి చెందిన ఎ.రమేశ్ శుక్రవారం ఎమ్మెల్యే బోండా ఉమాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయనను అభినందించి శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. ఆల్ ఇండియా లెవల్లో ఇస్రో నిర్వహించిన పరీక్షలో రమేశ్‌కు 9వ ర్యాంకు రావడం గర్వకారణమని కొనియాడారు.