కృష్ణా: ఈనెల 20 నుంచి 31వ తేదీ వరకు జిల్లాలో పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నట్టు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. శిబిరాలకు సంబంధించిన గోడపత్రికలను శుక్రవారం కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ శిబిరాల్లో వ్యాధి నిరోధక టీకాలు వేయడం, అవగాహనా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు.